Liquor: APలో మందుబాబులకు ఊహించని షాక్. పెద్ద కష్టమే ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్

Liquor మందుబాబులకు బ్యాడ్ న్యూ్స్: కొత్తగా వచ్చిన బ్రాండెడ్ మద్యం, దానికి తోడు తక్కువ ధరకు లభించడంతో ఏపీలో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఏపీలో మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. ఎంతో ఆశతో తాగి ఎంజాయ్ చేద్దాం అనుకుని వైన్ షాపులకి వెళ్లే వారికి భారీ షాక్ తగులుతోంది.

*Liquor: APలో మందుబాబులకు ఊహించని షాక్. పెద్ద కష్టమే ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్.

AP ప్రభుత్వ: కూటమి సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత మందుబాబుల ఆశలన్నీ నూత మద్యం పాలసీ, మద్యం రేట్లు తగ్గింపు, బ్రాండెడ్ బాటిళ్లు అందుబాటులోకి తీసుకురావడంపైనే ఉండేది. అయితే అనుకున్నట్లుగానే సీఎం చంద్రబాబు సర్కార్ అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. దీంతో మంచి బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఆనందం కొద్దికాలమే అనేలా ఉంది ఇప్పుడు మందుబాబుల పరిస్థితి. అసలే బ్రాండెడ్ మద్యం, దానికి తోడు తక్కువ ధరకు లభించడంతో ఏపీలో మందుబాబులు లిక్కర్‌తో పండగ చేసుకుంటున్నారు. అయితే ఏపీలో మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. ఎంతో ఆశతో తాగి ఎంజాయ్ చేద్దాం అనుకుని వైన్ షాపులకి వెళ్లే వారికి తీవ్ర నిరాశ ఎదురవుతుంది. 

రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ వచ్చిన తర్వాత బ్రాండెడ్ మద్యం విక్రయిస్తున్నారు. వైన్ షాపుల్లో అయితే గత కొన్నీ రోజులుగా రాష్ట్రంలోని ఏ మద్యం షాపులో కూడా సరిపడ స్టాక్ ఉండడం లేదు అంట. షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లు అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న వైన్ షాపులు అన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వేలంపాటలో దక్కించుకున్న వ్యక్తులు ఎంతో ఆశతో షాపులు తెరచి తెగ అమ్మకాలు జరపాలని ప్లాన్స్ చేస్తున్నారు. అయితే వీరికి కూడా ప్రభుత్వం నుంచి, డిస్టిబ్యూటర్స్ నుంచి అనుకున్న స్థాయిలో స్పందన కరువవుతున్నట్లు తెలుస్తోంది. వైన్ షాపు యజమానులు కొరత ఉన్న మద్యం బ్రాండ్లు, 10 కేసుల బీర్లు ఆర్డర్ పెడితే. ఒక్క కేసు షాపులకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి వస్తే క్వార్టర్ బాటిల్ రూ.99కే ఇస్తామని మాటిచ్చారు. అనుకున్నట్లుగానే ఏపీ సర్కార్ క్వార్టర్ బాటిల్ రూ.99కే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ క్వార్టర్ బాటిళ్లు కూడా సరిపడా సరుకు రావడం లేదు అంట. దీంతో చాలా మంది నిరాశకు గురువుతున్నారు.

యూత్ నుంచి పండు ముసలి వరకు ఎక్కువగా తాగే లిక్కర్‌లో ఇంపీరియల్ బ్లూ, మెక్ డోవెల్స్.. బీర్లలో కింగ్‌ఫిషర్, బడ్‌వైజర్ వంటివి ప్రస్తుతం కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ పాత పరిస్థితే వచ్చిందంటూ కొందరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

దీంతో పాటుగా మరో విషయంలో మద్యం షాపులు దక్కించుకున్నవారు ఆవేదన చెందుతున్నారు. వారు ఆశించిన మేర మద్యం అమ్మకాల్లో లాభాలు రావడం లేదని టాక్. వారికి పెద్దగా మార్జిన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం మాత్రం ప్రభుత్వం మాత్రం త్వరలోనే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది.

అయితే వఏపీలో మద్యం షాపుల్లో ప్రభుత్వం విధించిన రేట్లు, ఎమ్మార్పీ కంటే ఎవరైన ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశాలు ఇచ్చారు. MRP ధర కంటే ఎక్కువకి అమ్మితే తొలిసారి రూ.5లక్షలు జరిమానా, రెండో సారి తప్పు చేస్తే మద్యం షాపుల లైసెన్స్‌ను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version